టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2020-09-27T06:52:20+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రె్‌సలకు ఉనికి లేదని, టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే ఆ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు...

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 


చేగుంట, సెప్టెంబరు 26: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రె్‌సలకు ఉనికి లేదని, టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే ఆ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ పైవ్రేట్‌ ఫంక్షన్‌హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు 600 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చేగుంట, నార్సింగి మండలాల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గిరిజన తండాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామన్నారు. నార్సింగి మండలంలోని వల్లూరు, భీంరావుపల్లి గ్రామాలను చేగుంటలో కలుపుతామని, కిష్టాపూర్‌ను పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. కార్యక్రమంలో చేగుంట, నార్సింగి మండలాల ఎంపీపీలు మాసుల శ్రీనివాస్‌, చిందం సబిత, జడ్పీటీసీలు మోదం శ్రీనివాస్‌, బాణాపురం కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంగళరావు, చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్‌, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.


ఆడబిడ్డలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మి

చేగుంట, సెప్టెంబరు 26: ఆడబిడ్డలను ఆదుకోవాలనే సీఎం కేసీఆర్‌ మేనమామలా రూ. లక్ష 116 కల్యాణలక్ష్మి కానుక ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  అన్నారు. చేగుంట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 112 మంది లబ్ధిదారులకు వారు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌, బాణాపురం కృష్ణారెడ్డి, నార్సింగ్‌ ఎంపీపీ సబిత, సర్పంచులు మంచికట్ల శ్రీనివాస్‌, ఎర్రమ్మ అశోక్‌, ఆర్డీవో శ్యాంప్రకాష్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


చేగుంట మండలంలో విలీనం చేయాలని ర్యాలీ

నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామపంచాయతీని చేగుంట మండలంలో విలీనం చేయాలని గ్రామస్థులు శనివారం బైపాస్‌ నుంచి చేగుంట వరకు ర్యాలీ నిర్వహించి మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. నార్సింగికి వెళ్లేందుకు తీవ్రఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న చేగుంట మండలంలో విలీనం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2020-09-27T06:52:20+05:30 IST