తెలంగాణ రాష్ట్రానికిఅన్యాయం చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2021-10-20T04:57:53+05:30 IST

తెలంగాణ రాష్ట్రానికిఅన్యాయం చేసిన బీజేపీ

తెలంగాణ రాష్ట్రానికిఅన్యాయం చేసిన బీజేపీ
మర్రిపల్లిగూడెంలో మాట్లాడుతున్న మంత్రి హరీ్‌షరావు

ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం దండగ

హుజూరాబాద్‌లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం..

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీ్‌షరావు

కమలాపూర్‌, అక్టోబరు 19 : బీజేపీ  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు విమర్శించారు. మండలంలోని ఉప్పల్‌, మర్రిపల్లిగూడెం గ్రామాలలో మంగళవారం  ఎన్నికల  ప్రచార సమావేశాలలో పాల్గొన్న మంత్రి హరీ్‌షరావు మాట్లాడుతూ.. బీజేపీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఆస్తులను కాపాడుకునేందుకు, తన స్వార్థం కోసం బీజేపీలో చేరాడన్నారు. 

దళిత బంధు పథకంపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడం వల్ల ఈనెల 30 వరకు ఆపాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందన్నారు. నవంబరు 5,6 తేదీల్లో మళ్లీ తాను వచ్చి దగ్గరుండి యూనిట్లను గ్రౌండింగ్‌ చేయిస్తానన్నారు. ప్రతీ దళిత కటుంబానికి దళిత బంధు ఇప్పించే బాధ్యత తనదేన్నారు.  వానాకాలం ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటామన్నారు. ప్రజల పక్షాన ఉండే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకుందామన్నారు. రెండున్నరేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. రైతులకు రుణమాపీ  చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని, బడా బాబులకు మాఫీ చేసింది బీజేపీ అన్నారు. ఆ పార్టీకి ఓటు వేయడం దండగ అని వ్యాఖ్యానించారు.  సెంటిమెంట్‌, అబద్దాలతో ఈటల ఓట్లు సంపాదించాలని చూస్తున్నాడన్నారు. ఈటల గెలిస్తే ఆయనకే లాభమని,  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు లాభమన్నారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌, ప్రభుత్వ విప్‌ బా ల్క సుమన్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,  జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, స్వర్గం రవి, డాక్టర్‌ పెరియాల రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, నాయినేని తిరుపతిరావు, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, మారపల్లి నవీన్‌కుమార్‌, సర్పంచ్‌లు ఎర్రబెల్లి దేవేందర్‌రావు, ఇనుగాల కిరణ్మయి, ఎంపీటీసీలు ఎర్రబెల్లి సంపత్‌రావు, అరుణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:57:53+05:30 IST