కర్నూలును ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2020-05-29T10:40:33+05:30 IST

వెనెకబడిన కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ దృఢ సంకల్పంతో ఉన్నారని ..

కర్నూలును ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

 ‘మన పాలన మీ సూచన’లో మంత్రి గుమ్మనూరు


కర్నూలు, మే 28(ఆంధ్రజ్యోతి): వెనెకబడిన కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు  సీఎం జగన్‌ దృఢ సంకల్పంతో ఉన్నారని  కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.  గురువారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ’మన పాలన-మీ సూచన’ నాల్గో రోజు కార్యక్రమంలో భాగంగా  పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమ థనంలో పాల్గొన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మె ల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌, కలెక్టర్‌ వీరపాం డియన్‌, జేసీ-3 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిఽధి మీనా పాల్గొన్నారు. మంత్రి జయరాం మాట్లాడుతూ పరిశ్రమలతో యువతకు ఉపాఽధి అవకాశాలు వస్తాయని సీఎం పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాయదుర్గం టెక్స్‌టైల్‌ పరిశ్రమ తరహాలో ఆలూరు నియోజకవర్గంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.


పత్తికొండ, ఆస్పరి, ఆలూరు ప్రాంతాల్లో టమోటా జూస్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు.   ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్ప త్తులను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగుల నిర్మాణానికి ఔత్సాహికులు ముందుకు రావాలని సూచించారు.  కలెక్టర్‌  వీరపాండియన్‌ మాట్లా డుతూ పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అనుకూల వనరులు న్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీలు స్థాపిం చిన అనంతరం వాటిని ప్రోత్సహించాలని కోరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ జిల్లాకు ఎలకా్ట్రనిక్‌, టెలీ కమ్యూనికేషన్‌, సర్వీసు ప్రొవైడర్లు వస్తే మంచిదని అన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్‌ సోమశేఖర్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:40:33+05:30 IST