వెనుకబడిన వర్గాల విద్యా ప్రధాత కేసీఆర్: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-07-06T20:20:31+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) ఉన్నత విద్యావంతుడు కాబట్టే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు

వెనుకబడిన వర్గాల విద్యా ప్రధాత కేసీఆర్: మంత్రి Gangula

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) ఉన్నత విద్యావంతుడు కాబట్టే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు. బుధవారం ఖైరతాబాద్ లోని తన కార్యాలయంలో నూతన బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై ముఖ్యమంత్రికి పంపాల్సిన ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 281 బీసీ గురుకులాలు ఉన్నాయని(bc residential) ఇందులో 143 పాఠశాలలు, 119 పాఠశాలల్తో పాటు జూనియర్ కాలేజీలు,19 జూనియర్ కాలేజీలు 1డిగ్రీ కాలేజీ ద్వారా 1,52,440 మంది విద్యార్థులకు సేవలందిస్తున్నాయని తెలిపారు.కొత్తగా రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్ గా ప్రతీ జిల్లాలో మరో 33 గురుకుల పాఠశాలల్ని ప్రారంభించేవిదంగా ప్రతిపాధనలు సిద్దం చేయాలని ఆదేశించామన్నారు. వీటిద్వారా 7920 మంది బీసీ విద్యార్థులకు అధనంగా లబ్ధీ చేకూరుతుందని, ప్రతీ ఏడు నూతన బీసీ  గురుకులాలను ప్రారంబిస్తూ త్వరలోనే ప్రస్థుతం ఉన్నవాటికి రెట్టింపుగా విద్యాసంస్థల్ని ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుండి మరో 4 స్కూళ్లను జూనియర్ కాలేజీలు అప్ గ్రేడ్ చేయడంతో పాటు వచ్చే సంవత్సరం మరో 115 స్కూళ్లను అప్ గ్రేడ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు,వీటి ద్వారా 15,600 విద్యార్థులు అదనంగా ఇంటర్ విద్యను అభ్యసిస్తారని, ప్రస్తుతం ఒక మహిళా డిగ్రీ కళాశాలను మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకులాల సంస్థ నిర్వహిస్తుండగా అధనంగా మరో 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.


వీటి ద్వారా 3600 మంది అత్యున్నత స్థాయి విద్యను ఈఏడే అభ్య సించబోతున్నారని తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయబోయే డిగ్రీ కళాశాలల్లో కోర్సులను సైతం వైవిద్యంగా తీర్చిదిద్దాలన్నారు మంత్రి గంగుల, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం అందించాలని ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రిని ఆదేశించారు, డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు సరికొత్త వాటిని ప్రవేశపెట్టాలన్నారు.ఇండస్ట్రీ అవసరాల మేరకు వాటితో అనుసందానమయిన కోర్సులను రూపొందించాలని ఆదేశించారు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, సాప్, న్యూట్రీషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ వంటి కోర్సులను కాలేజీల వారీగా అందజేయాలని సూచించారు. 



వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలోనే సంక్షేమ శాఖ ద్వారే క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహించి అత్యున్నత వేతనాలు అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 21 స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాల కోసం ఇక్కడ శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి గంగుల ఆదేశించారు. 

Updated Date - 2022-07-06T20:20:31+05:30 IST