ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో వుంది: Gangula kamalakar

ABN , First Publish Date - 2022-06-08T00:33:21+05:30 IST

ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ (petroll, diesel) పోయించుకోవచ్చని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)అన్నారు.

ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో వుంది: Gangula kamalakar

హైదరాబాద్: ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ (petroll, diesel) పోయించుకోవచ్చని భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)అన్నారు.రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదని, రెగ్యులర్గా ఉండాల్సిన నిల్వలు ఉన్నాయని, నిరంతరాయంగా సరఫరా జరుగుతుందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం హైదరాబాద్ లోని  తన కార్యాలయంలో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనవసర పుకార్లకు ప్రజలెవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.  


ఆర్టీసీ సంస్థల బస్సులు సైతం రిటైల్ బంకుల నుండే డీజిల్ని వాడుకుంటున్నారని అందువల్ల బంకుల్లో త్వరత్వరగా స్టాక్స్ అయిపోతున్నాయని వీటిపై సివిల్ సప్లైస్ డిపార్మెంట్ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొరత లేకుండా చూస్తుందన్నారు.రాష్ట్రంలో మొత్తం అన్ని కంపెనీలవి కలిపి 3520 బంకులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 480 బంకుల్లో నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగిస్తున్నామన్నారు. 807 ఎల్పీజీ ఔట్ లెట్లలో సైతం కావాల్సినంత స్టాక్ ఉందన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో రెగ్యులర్గా ఉండేవిదంగానే పెట్రోల్ 38,571 కిలో లీటర్లు, డీజిల్ 23,875 కిలో లీటర్లు ఉందని ఇది నాలుగు నుండి ఐదు రోజులకు సరిపోతుందని, స్టాక్ మూమెంటును బట్టి ఎప్పటి మాదిరిగా నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ రాష్ట్రానికి వస్తూనే ఉందన్నారు.


హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగంలో గతంలో మాదిరిగానే ఉందని, ఎక్కడా క్రుత్రిమ కొరత స్రుష్టించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని, లైసెన్సుల రద్దీ చేయడానికి సైతం వెనుకాడమన్నారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్, ఆయిల్ కంపెనీల స్టేట్ కో ఆర్డినేటర్ యెతేంద్ర పాల్ సింగ్, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ పి. మంగీలాల్, బీపీసీఎల్ డీజీఎం కెఎస్వీ బాస్కర్ రావు, ఐఓసీఎల్ జనరల్ మేనేజర్లు ఎన్ బాలక్రుష్ణ, ఎం.బి.మనోహర్ రాయ్ ఇతర సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T00:33:21+05:30 IST