Abn logo
May 17 2021 @ 14:15PM

ఈటల కొత్త నాటకం: మంత్రి గంగుల

కరీంనగర్: అబద్దాలతో సానుభూతి కోసం  ప్రయత్నిస్తూ.. ఆత్మగౌరవమంటూ మాజీమంత్రి ఈటల రాజేందర్ కొత్త నాటకం ఆడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కమలాపూర్ హుజరాబాద్  మండలాల ప్రజాప్రతినిధులు మంత్రి గంగులని  కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఎవరూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని రెండు మండలాల వారు స్పష్టం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని.. కేసులు  కూడా నమోదయ్యాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఉద్యమంలో పాల్గొనలేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిస్తే ఊరుకోమని.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్  హెచ్చరించారు. 

Advertisement