ప్రజల భద్రతకు రూ.95 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్:Gangula

ABN , First Publish Date - 2022-06-15T21:47:40+05:30 IST

కరీంనగర్ పట్టణ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజల భద్రతే లక్ష్యంగా 95 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్(integrated command controll) ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.

ప్రజల భద్రతకు రూ.95 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్:Gangula

కరీంనగర్: కరీంనగర్ పట్టణ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజల భద్రతే లక్ష్యంగా 95 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్(integrated command controll) ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.హైదరాబాద్ నుండి కరీంనగర్ వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ నేరుగా ఎల్ఎండి లేక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ ను పరిశీలించారు. ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని ట్రాక్ ను ఆనుకుని ఇరువైపుల పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. 


మొక్కలు పెరిగి వృక్షాలుగా మారితే అహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాకింగ్ చేసే వారికి అటవీ ప్రాంతంలో వాకింగ్ చేసినట్టు అనుభూతి కలుగుతుందన్నారు. అనంతరం కరీంనగర్ సిటీ రెనోవేషన్ (KCR) లో భాగంగా నగరంలో 95 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ పనులకు స్థానిక తెలంగాణ చౌక్ లో బుధవారం భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం కోసం మానేరు జలాశయం దిగువన నుతన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.


నగర ప్రజలు మానేరు డ్యామ్ మీద నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని తమ దృష్టికి తేవడంతో జలాశయం కింద కోటి రూపాయలతో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.ఇంటిగ్రేటెడ్ కామాండ్ కంట్రోల్ మున్సిపల్ పై అంతస్థులో ఉంటుందని నగరం మొత్తం ఇంచు ఇంచు కనిపించేలా ఈ కమాండ్ కంట్రోల్ పని చేస్తుందని దీని కోసం నగరంలో 335 HD కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-06-15T21:47:40+05:30 IST