సమైక్యపాలనలో పన్నులు కట్టినా రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి Gangula

ABN , First Publish Date - 2022-06-03T20:15:41+05:30 IST

సమైక్య పాలనలో పన్నులు కట్టినా... రోడ్లు అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేవని, దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా గత పాలకులు రోడ్లు వేసిన పాపాన పోలేదని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(ganhula kamalakar)అన్నారు

సమైక్యపాలనలో పన్నులు కట్టినా  రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు: మంత్రి Gangula

కరీంనగర్: సమైక్య పాలనలో పన్నులు కట్టినా... రోడ్లు అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేవని, దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా గత పాలకులు రోడ్లు వేసిన పాపాన పోలేదని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(ganhula kamalakar)అన్నారు.ఎన్నో పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం...తెలంగాణలో సంపద పెరిగి... అది భావితరాలకు పంచాలని తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని అన్నారు. శుక్రవాకంర కరీంనగర్ లో పట్టణ ప్రగతి నాలుగో విడత(pattana pragati) కార్యక్రమాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఒకసారి గమనించాలన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి... పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టారని మంత్రి తెలిపారు. 


పల్లెలు, పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెంది పరిశుభ్రంగా ఉండాలని,పల్లెలు మెరిసి ప్రజలు మురువాలని సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. గత పాలకుల హయాంలో తాగునీరు లేక వాటర్ ట్యాంకర్ల వద్ద యుద్ధాలు జరిగిన పరిస్థితులు ఉండేవి. అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి చేసేందుకు గత పాలకులకు మనసు రాలేదని అన్నారు. డ్రైనేజీలు సరిగ్గా లేక... కలుషిత నీటితో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరిన రోజులు ఉండేవి, పట్టణాల ను ఆధునీకరించేందుక మున్సిపల్ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తుందన్నారు.ప్రస్తుతం కరీంనగర్ లో ఏ మూల చూసినా అభివృద్ధి పనులు జరుగుతూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-03T20:15:41+05:30 IST