రైతు దర్నాలు,రైతుకు ఇబ్బందులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యం:Gangula

ABN , First Publish Date - 2022-05-04T20:48:19+05:30 IST

వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు, నీళ్లు, మౌళిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు అక్కడ లేరనే అక్కసుతో కంళ్లమంటతో మన రాష్ట్రానికి చెందని పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Gangula kamalakar అన్నారు,

రైతు దర్నాలు,రైతుకు ఇబ్బందులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యం:Gangula

కరీంనగర్: వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు,నీళ్లు, మౌళిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు అక్కడ లేరనే అక్కసుతో కంళ్లమంటతో మన రాష్ట్రానికి చెందని పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Gangula kamalakar అన్నారు, ఈ పార్టీల మాదిరే కొన్ని ప్రసార మాద్యమాలు సైతం కొనుగోలు లేటయిందని, గన్నీలు ఉన్నాయా అని రైతుల్లో గందరగోళం స్రుష్టిస్తున్నాయని ఇది సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కFarmer ఇబ్బందులు పడుతున్నామనే పిర్యాదులు రాకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. రైతు కోతలు చేసి కొనుగోలు కేంద్రానికి ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో తీసుకురావాలని ఒక్క కిలో కూడా తరుగు పెట్టమన్నారు, గన్నీల లభ్యతపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గంగుల తిప్పికొట్టారు, 


ఈ యాసంగిలో అవసరమైన గన్నీబ్యాగులు 15కోట్లుగా అంచనా వేసామని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే నాటికే మన వద్ద మొత్తం 1కోటి 62 లక్షల 70వేల 611 గన్నీ బ్యాగులున్నాయని, మే 1 నాటికి 4కోట్లు సేకరిస్తామని చెప్పామని చెప్పారు. నిన్నటి వరకూ 7కోట్ల 67లక్షల గన్నీ బ్యాగులను సిద్దం చేసుకున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేనే లేదన్నారు. ఎక్కడ తక్కువ ఉన్నా మా ద్రుష్టికి తెస్తే తక్షణం పంపిస్తామన్నారు.కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి ,అసిఫ్ నగర్ ,నాగుల మాల్యాల లో DCMS ,iKP ,PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించి మాట్లాడారు.


కేంద్రం మోకాలడ్డిన పరిస్థితుల్లోనూ ఆర్థిక భారాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం విధితమే. అయితే రాష్ట్రంలో కొంటున్న ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు చేర్చి ఓపిఎంఎస్లో గుర్తించాలని అన్నారు. అప్పుడే రైతులకు త్వరితంగా నిధుల్ని బదిలీ చేసే అవకాశం ఉంటుందని చెప్తూ ఇదే సమయంలో ఎఫ్.సి.ఐ పిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతుందని తద్వారా రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించే ప్రక్రియ నిలిపివేయాల్సి వస్తుందని అన్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ కి ఇది సరైన సమయం కానందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు సత్వర సేవలు అందేలా చూడాల్సిన బాధ్యతలు తీసుకోవాలన్నారు. సరైన సమయంలో పీవీ చేయడమే కాకుండా ఎలాంటి అక్రమాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. 

Read more