నిజమైన రైతు బాంధవుడు కేసీఆర్: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2022-04-28T00:21:25+05:30 IST

కరువుల నుండే వ్యవసాయ అనుకూల విధానాలు, ఎఫ్.సి.ఐ లాంటి సంస్థలు ఏర్పడ్డాయని,1967లో బాయిల్డ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

నిజమైన రైతు బాంధవుడు కేసీఆర్: మంత్రి గంగుల

హైదరాబాద్: కరువుల నుండే వ్యవసాయ అనుకూల విధానాలు, ఎఫ్.సి.ఐ లాంటి సంస్థలు ఏర్పడ్డాయని,1967లో బాయిల్డ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.ఎప్.సి.ఐ పుట్టినప్పటినుండి అనుసరిస్తున్న విదానాలకు తిలోదకాలు ఇచ్చింది నేటి కేంద్ర బీజేపీ ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు.యదాతథంగా ధాన్యం కొనమనటం మన  హక్కు అని కానీ కేంద్రం  రాజ్యంగ భాద్యతల్నుంచి పారిపోతున్నదని, ఆదానీకి దాన్యం అమ్ముకొమ్మని బహిరంగంగా ఉత్తర్వులివ్వడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే రైతు ఆగమయ్యేవాడు.మనుసున్న కేసీఆర్ ఎప్పటికీ రైతు పక్షపాతే, రైతు కుటుంబాల దీవెనార్థులు కేసీఆర్ పైనే నని ఆయన స్పష్టం చేశారు. నిజమైన రైతుబాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. బుధవారం టీఆర్ఎస్ 21వ వార్సికోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. 


హైదరాబాద్ హైటెక్స్ హెచ్ఐసిసి వేదికగా జరుగతున్న తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో మంత్రి గంగుల మాట్లడారు.  కేంద్రం యాసంగి ధాన్యం కొనే బాధ్యతల్నించి పారిపోయినా కొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి అభినందనలు తెలిపే తీర్మానాన్నిమంత్రి బలపర్చారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ ‘యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు ప్రవేశపెట్టిన ఈ అభినందన తీర్మాన్నాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ...,స్వాగతిస్తూ...బలపరుస్తున్నానన్నారు. ఈ సందర్భంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు, పాలకులకు చరిత్రపైఅవగాహన ఉండాలని, తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. బౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో వాటి ఉత్పత్తిని పెంచే బాధ్యతను రాష్ట్రాలకు, వాటికి మద్దతు దరల నిర్ణయం, సేకరణ, సరఫరా బాధ్యతను పూర్తిగా కేంద్రానికి అప్పగిస్తూ రాజ్యాంగంలో సుస్పష్టం చేసారన్నారు. 

Updated Date - 2022-04-28T00:21:25+05:30 IST