అందరికీ విద్య..అదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గంగుల కమలాకర్

ABN , First Publish Date - 2022-04-20T20:51:36+05:30 IST

విద్య ,వైద్యారంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని , బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

అందరికీ విద్య..అదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: విద్య ,వైద్యారంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పెద్దపీట వేస్తుందని , బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం తీగల గుట్టపల్లి లో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని  బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్  ప్రారంభించారు..


ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించాలని సంకల్పంతోసీఎం కేసీఆర్ గారు  మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలను  ఆధునికరిస్తుందని వెల్లడించారు.బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని,74 ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో   కేవలం 16 గురుకుల పాఠశాలలు ఉండేవని వాటిలో  9000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారని గుర్తు చేశారు.


తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 7సంవత్సరాలలో 281 గురుకులాలు స్థాపించి 1 లక్ష 35 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.ఉన్నత వర్గాలకు దీటుగా నిరుపేద విద్యార్థులకు గురుకులాల  ద్వారా నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని వెల్లడించారు.మన ఊరు-మన బడి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని రాజకీయాలకతీతంగా విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు..ప్రతి ఊరిలో దేవాలయం, విద్యాలయం ఉంటాయని స్కూళ్లు కూడా దేవాలయాల్లంటివే అన్నారు.పవిత్రంగా భావించే ఆలయాలు, విద్యాలయాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని సీఎం సంకల్పించారని అన్నారు.కరీంనగర్ జిల్లాలోని ఏదైనా స్కూలుకు వాడుకునే విధంగా తన సోదరుని పేరిట 20 లక్షల రూపాయలు మా కుటుంబం తరపున ఇస్తామని ప్రకటించారు.కోటి రూపాయలు ఎవరైనా విరాళం ఇస్తే వారు కోరిన వారి పేరును ఆ స్కూలుకు పెడతమని,10 లక్షలు ఇస్తే తరగతి గదికి పేరు పెడతామని అన్నారు. 5 లక్షలు ఇస్తే స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.



పాఠశాలల అభివృద్ధికి ఇచ్చే డొనేషన్ చేస్తే వృథా కావని.ఒకప్పుడు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు పిల్లలు వస్తే తమకు ఆసరాగా ఉంటుందని పేరెంట్స్ పిల్లలను మధ్యలోనే బడిమాన్పించేవారని గుర్తు చెసారు..ఇప్పుడు కూలీ చేసుకునేవాళ్లు కూడా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని తాపత్రయపడుతున్నారని అన్నారు..అలాంటి పిల్లలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టామని, పేద పిల్లలు చదువుకునే సర్కారు స్కూలును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యంఅని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరి శంకర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కార్పొరేటర్లు కొలగని శ్రీనివాస్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ అధికారులు సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-20T20:51:36+05:30 IST