పోలీసులు వర్సెస్ మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-12-10T19:38:27+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలీసులతో మంత్రి గంగుల కమలాకర్ వాగ్వాదానికి దిగారు.

పోలీసులు వర్సెస్ మంత్రి గంగుల

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలీసులతో మంత్రి గంగుల కమలాకర్ వాగ్వాదానికి దిగారు. కండువాలు వేసుకుని రావద్దంటూ అడ్డుకున్న పోలీసులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చెబితే తమను ఆపుతారా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. తాము వేసుకున్నది టీఆర్ఎస్ కండువాలు కాదని అన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నేతల నినాదాలపై ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల నినాదాలపై సీపీ సత్యానారాయణ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-10T19:38:27+05:30 IST