యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి Gangula kamalakar

ABN , First Publish Date - 2022-07-01T20:23:13+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో చేపట్టిన యాసంగి ధాన్యం సేకరణ(yasangi procurement) ముగింసిందని

యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి Gangula kamalakar

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో చేపట్టిన యాసంగి ధాన్యం సేకరణ(yasangi procurement) ముగింసిందని, రైతులకు సకాలంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) అన్నారు.శుక్రవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.ఈ ఏడాది రబీలో 9916 కోట్ల విలువగల 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 9 లక్షల 52వేల మంది రైతుల దగ్గరనుండి సేకరించామన్నారు. ఈ నిదుల్ని మొత్తం సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకొందని తెలిపారు. మొత్తం 9724 కోట్లకు గానూ 9680 కోట్లను సకాలంలో రైతులకు చెల్లించామని మంత్రి తెలిపారు. 


ఓపీఎంఎస్ లో నమోదైన ప్రకారం వెంట వెంటనే చెల్లింపులు కొనసాగుతాయన్నారు.అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6,42,894 మెట్రిక్ టన్నుల్ని, అత్యల్పంగా అధిలాబాద్ లో 322 మెట్రిక్ టన్నుల్ని సేకరించామన్నారు.2014-15 సీజన్ నుండి ఇప్పటివరకూ దాదాపు ఒక కోటీ ఎనిమిది వేల కోట్లను ప్రభుత్వం రైతులకు అందజేసిందని, ఎంఎస్పీ ప్రకారం పంట సేకరణ చేయడమే కాకుండా కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలుగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేశామన్నారు. 


తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటివరకూ 6 కోట్ల 6 లక్షల 53వేల 234 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసామన్నారు.దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు అండగా నిలవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం పోటీరాలేదన్నారు. రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, ధాన్యం సేకరణ వంటి రైతు అనుకూల విధానాల్ని అవలంబిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి గంగుల అన్నారు. 

Updated Date - 2022-07-01T20:23:13+05:30 IST