బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నాం: Gangula kamalakar

ABN , First Publish Date - 2022-06-02T21:24:08+05:30 IST

తెలంగాణ ప్రజలు కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనిస్తున్నామని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar) అన్నారు.

బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నాం: Gangula kamalakar

కరీంనగర్: తెలంగాణ ప్రజలు కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనిస్తున్నామని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar) అన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగామన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు.గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాలు( telangana formation day) కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. 


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు భీమా వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు.  నిరంతర ప్రగతి- శీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన ఫలితం. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికి గర్వకారణామని అన్నారు. గత సమైఖ్య రాష్ట్రంలో పాలకులకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి దేశంలో మరే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 

 

Updated Date - 2022-06-02T21:24:08+05:30 IST