బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో నూతన శకం: Gangula

ABN , First Publish Date - 2022-06-01T22:25:58+05:30 IST

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్(kcr) సంకల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) కృషితో బుధవారం ఉప్పల్ భగాయత్ లో దేవాంగ కులానికి సంబంధించిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో నూతన శకం: Gangula

హైదరాబాద్: బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్(kcr) సంకల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) కృషితో బుధవారం ఉప్పల్ భగాయత్ లో దేవాంగ కులానికి సంబంధించిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఏక సంఘంగా ఏర్పడిన ఆయా కుల సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల ట్రస్ట్ లు ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నాయి.ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ లో దేవాంగ  కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం చెరో ఎకరా భూమి చెరో కోటి రూపాయలు మంజూరు చేసింది.ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు.


ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి బీసీలను పట్టించుకోలేదని, కనీస వసతి కోసం గుంట జాగ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం కేసీఆర్ బీసీ కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలాల్ని కేటాయించారని, 41 బీసీ కులాలకు ఎనభై మూడు ఎకరాలు కేటాయించారన్నారు. అంతేకాకుండా భవనాలు నిర్మించుకోవడానికి సైతం ఎకరాకు కోటి రూపాయలు కేటాయించారన్నారు.అందులో భాగంగానే ఉప్పల్ భగాయత్ లోని దేవాంగ కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి  శంకుస్థాపన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. 


 ఇప్పటి వరకు 15కుల సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చి ఏక సంఘాలుగా ఏర్పడ్డాయని వాటికి అనుమతి పత్రాలు అందచేసామని. వాటిలో దేవాంగ కుల సంఘ భవనానికి భూమి పూజ జరిగిందని, మిగతా అన్ని సంఘాలు కూడా ఒక్కతాటి పైకి వచ్చి త్వరలో  ఏకసంఘంగా ఏర్పడి భవన  నిర్మాణాలు ప్రారంభించు కోవాలని ఈ వేదిక ద్వారా కోరారు.సీఎం కేసీఆర్ పాలనలో బీసీలుగా పుట్టడం అదృష్టం అన్నారు. ఉన్నత వర్గాలకు దీటుగా బీసీలు సైతం బతకాలని, వేల కోట్లు నిధులు ఇస్తే సరిపోదని వారు ఆత్మ గౌరవంతో ఉండేలా ప్రభుత్వం గౌరవించుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు.

Updated Date - 2022-06-01T22:25:58+05:30 IST