తెలంగాణ పై విషం చిమ్ముతున్నమోది: Gangula kamalakar

ABN , First Publish Date - 2022-05-27T00:14:23+05:30 IST

ప్రధాని మోదీ(modi) మరోసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మారని, తెలంగాణ రాష్ట్రమన్నా, ఉద్యమ నేత కేసీఆర్(kcr) కుటుంబమన్నా బీజేపీకి భయం అని మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)అన్నారు.

తెలంగాణ పై విషం చిమ్ముతున్నమోది: Gangula kamalakar

హైదరాబాద్: ప్రధాని మోదీ(modi) మరోసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మారని, తెలంగాణ రాష్ట్రమన్నా, ఉద్యమ నేత కేసీఆర్(kcr) కుటుంబమన్నా బీజేపీకి భయం అని మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)అన్నారు. గురువారం నగరానికి వచ్చిన మోదీ ప్రసంగంపై ప్రకటనలో తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమంలో అగ్రపథాన.సింహబాగం ఉన్నది కేసీఆర్ కుటుంబం అని, కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో వారు రాజకీయాల్లో ఉన్నారని, నామినేటెడ్ గా రాలేదన్నారు, బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.గత ప్రభుత్వాల హాయంలో మత విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని, హైదరాబాద్ నగరంలో కర్య్పూలు, విద్వంసం ఉండేదని, నేడు కేసీఆర్ నేత్రుత్వంలో శాంతి భద్రతలు బాగున్నాయన్నరు.


గుజరాత్ రాష్ట్రం కన్నా అన్ని రంగాల్లో ముందున్నామనే కుట్రతో, ఓర్వలేని తనంతో ప్రదాని మాట్లాడుతున్నారని మంత్రి గంగుల ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే, కేసీఆర్ కుటుంబానికే తెలంగాణలో ఓట్లడిగే హక్కుందన్నారు. మూడనమ్మకాలు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు.గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబద్కి క్యూ కట్టాయంటే ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు, మతాన్ని, మత విశ్వాసాల్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే బీజేపీ నేతలు మూడ నమ్మకాలపై మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు.


దేవున్నిగుండెల్లో పెట్టుకొని పూజించే నైజం మాదైతే, ఆ దేవున్ని అడ్డుపెట్టుకొని ఆ సెంటిమెంటును రాజకీయం చేస్తుంది బీజేపీ అని బహిరంగంగా ప్రజలందరకీ వాళ్లే చెప్తున్నారన్నారు. మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ అనే దేశం భావిస్తుందని, దేశంలోని అన్ని సహజ వనరుల్ని సంపూర్ణంగా వినియోగించే సమర్థ నాయకత్వం కేసీఆర్ ది మాత్రమే అని అన్నారు. మోదీ అసమర్థ పాలనను తరిమికొట్టేందుకు, దేశ ప్రజలకు మంచి చేసేందుకు కేసీఆర్ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు మంత్రి గంగుల పేర్కొన్నారు.


Updated Date - 2022-05-27T00:14:23+05:30 IST