కుమ్మరి వృత్తిదారులకు ఎలక్ర్టికల్‌ పాటరీ వీల్స్‌ యంత్రాల పంపిణీ- గంగుల

ABN , First Publish Date - 2021-07-30T21:18:12+05:30 IST

కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ర్టానిక్‌ పాటరీ వీల్స్‌ యంత్రాల పంపిణీకి ప్రభుత్వం సుముఖంఆ ఉందని బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు

కుమ్మరి వృత్తిదారులకు ఎలక్ర్టికల్‌ పాటరీ వీల్స్‌ యంత్రాల పంపిణీ- గంగుల

హైదరాబాద్‌: కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ర్టికల్ పాటరీ వీల్స్‌ యంత్రాల పంపిణీకి ప్రభుత్వం సుముఖంఆ ఉందని బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు ఈమేరకు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి ప్రతినిధులు శుక్రవారం మంత్రి గంగులనుకలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై మంత్రి గంగుల మాట్లాడుతూ ఇప్పటికే కుమ్మరి వృత్తిచేసే యువతకు సీఎం కేసీఆర్‌ ఆధునిక శిక్షణ ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ శిక్షణ ద్వారా ధునిక యంత్రాల పై మంచి అవగాహన కలిగిందని వారు తెలిపారు.


ఈ ఆధునిక యంత్రాల ద్వారా మట్టిగణపతులు, వాటర్‌బాటిళ్లు వంటి వస్తువుల తయారీని చేపడుతున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇక ఆధునిక ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్‌ కోసం 20శాతం డీడీలను కడితే 80 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల విలువగల యంత్రాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి గంగుల తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 320 మంది కుమ్మరి వృత్తిదారులు డీడీలు కట్టారని, హుజూరాబాద్‌ నియోజక వర్గంలో డీడీలు కట్టిన వారికి యంత్రాల్ని అందించే పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాలని మంత్రిని కుమ్మరిసంఘం ప్రతినిధులు కోరారు. వెంటనే మంత్రి స్పందించి బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-07-30T21:18:12+05:30 IST