గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా?.. బండి సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్

ABN , First Publish Date - 2022-01-05T23:52:59+05:30 IST

కరీం‌నగర్‌లో జన జాగరణ దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల ఎదుట బండి సంజయ్ తన తలను గోడకు కొట్టుకున్నారు. బండి సంజయ్ అలా చేయడంపై..

గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా?.. బండి సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: కరీం‌నగర్‌లో జన జాగరణ దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల ఎదుట బండి సంజయ్ తనకు తానే తలను నెలకు కొట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆపడంతో బండి సంజయ్ తలకు స్వల్పంగా గాయమైంది. అయితే బండి సంజయ్ అలా చేయడం పట్ల మంత్రి కేటీఆర్ విమర్శలు కురిపించారు. బండి సంజయ్ పిచ్చోడని,  ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏం చేస్తాడో ఆయనకే తెలియదని కేటీఆర్ విమర్శించారు. బండి పోతే బండి ఫ్రీగా వస్తుందని, గుండు పోతే గుండు ఫ్రీగా వస్తుందా?. అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 



Updated Date - 2022-01-05T23:52:59+05:30 IST