Abn logo
Sep 17 2020 @ 09:07AM

‘బిగ్‌‌బాస్ పోటీదారులా ఇంట్లో దాక్కుని విమర్శలా?’

చెన్నై : ‘బిగ్‌ బాస్‌’ పోటీదారుల్లా వందరోజులకు పైగా మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ ఇంటిలో దాక్కుని ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జయకుమార్‌ ఎద్దేవా చేశారు. నగరంలో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందనే కమల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది 150 రోజులు అవుతుందన్నారు. ‘బిగ్‌ బాస్‌’ ఇంట్లో వంద రోజులు వుండి బయటకు వచ్చిన వారికి నగదు, బహుమతులు అందిస్తున్నారని, కమల్‌ కూడా 150 రోజులు బిగ్‌ బాస్‌ ఇంట్లోనే కూర్చొని ఉన్నారని, అలాంటి ఆయన కరోనా నియంత్రణ చర్యల్లో 24 గంటలు పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement