యాదాద్రి భువనగిరి: శ్రీ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికి, ఆశీర్వచనం, స్వామివారి పట్టు వస్త్రాలను అందచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తమ ఇలవేల్పు అయిన లక్ష్మీనర్సింహ స్వామి వారిని తరచూ దర్శించుకుంటామని అన్నారు. సిఎం కెసిఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి