తొర్రూరులో ముగిసిన టెట్ శిక్ష‌ణా శిబిరం-Errabelli చిత్ర ప‌టానికి పాలాభిషేకం

ABN , First Publish Date - 2022-05-30T00:15:54+05:30 IST

మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తొర్రూరులో ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్(errabelli trust) ఆధ్వ‌ర్యంలో 60 రోజులుగా న‌డుస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ (tet) శిబిరం ఆదివారంతో ముగిసింది.

తొర్రూరులో ముగిసిన టెట్ శిక్ష‌ణా శిబిరం-Errabelli చిత్ర ప‌టానికి పాలాభిషేకం

తొర్రూరు: మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తొర్రూరులో ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్(errabelli trust) ఆధ్వ‌ర్యంలో 60 రోజులుగా న‌డుస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ (tet) శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ సంద‌ర్భంగా శిక్ష‌ణ తీసుకున్న ప‌లువురు ఈ శిక్ష‌ణ పూర్తి ఉచితంగా ఇప్పిస్తున్న ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ పోశ‌కులు, చైర్ ప‌ర్స‌న్ ఉషా ద‌యాక‌ర్ రావు(usha dayakar), మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli dayakar rao) చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు.గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో తొర్రూరు, పాల‌కుర్తి కేంద్రాలుగా, రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో, ఆయన స‌తీమ‌ణి ఉషా ద‌యాక‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో ఉచిత ఉపాధి, ఉద్యోగ‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 


ఇప్ప‌టికే ఎంతో మందికి ఉద్యోగావ‌కాశాలు ద‌క్కేలా శిక్ష‌ణ ఇప్పిస్తున్న ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఈ ఏడాది కూడా ప్ర‌భుత్వ ఉద్యోగార్థుల కోసం టెట్‌, పోలీసు కానిస్టేబుల్‌, ఎస్ ఐ., గ్రూప్స్ కోసం ఉచితంగా తొర్రూరు కేంద్రంగా శిక్ష‌ణను ఆచార్య జ‌య‌శంక‌ర్ కోచింగ్ సెంట‌ర్ తో స‌మ‌న్వ‌యం చేసి ఇప్పిస్తున్న‌ది. ఇందులో భాగంగా తొర్రూరులో 60 రోజులుగా టెట్ ఉద్యోగార్థులు 300 మందికి ఉచితంగా కోచింగ్ జ‌రుగుతున్న‌ది. అభ్య‌ర్థుల‌కు ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం పెడుతూ, ఉచితంగా మెటీరియ‌ల్ ఇచ్చి, శిక్ష‌ణ‌ను కూడా పూర్తి ఉచితంగానే ఇప్పించారు.


ఆదివారంతో ఈ శిక్ష‌ణా కర్యక్రమం ముగిసింది. శిక్ష‌ణ ముగించుకున్న అభ్య‌ర్థులు, స‌మ‌న్వ‌య‌క‌ర్త పంజా క‌ల్ప‌న,ఎర్రం రాజుల ఆధ్వ‌ర్యంలో మంత్రి ఎర్ర‌బెల్లి, ఉషా ద‌యాక‌ర్‌రావుల చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు.ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ, త‌మ‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇప్పించిన మంత్రికి, ఉషాదయాకర్ కి జీవితాంతం రుణ ప‌డి ఉంటామ‌న్నారు. వారిప్పించే శిక్ష‌ణ‌తో గ‌తంలో అనేక మందికి ఉద్యోగావ‌కాశాలు వ‌చ్చాయ‌ని, అదే త‌ర‌హాలో త‌మ‌కు కూడా ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న‌న‌మ్మ‌కం క‌లిగింద‌న్నారు. 

Updated Date - 2022-05-30T00:15:54+05:30 IST