ఆందోళన వద్దు...జాగ్రత్త గా ఉంటే చాలు కరోనాను దూరం పెట్టొచ్చు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-31T22:51:46+05:30 IST

కరోనా గురించి ఎవరూ భయ పడొద్దు... కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఆందోళన వద్దు...జాగ్రత్త గా ఉంటే చాలు కరోనాను దూరం  పెట్టొచ్చు: మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ: కరోనా గురించి ఎవరూ భయ పడొద్దు... కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. హనుమకొండ నుండి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.గత రెండు రోజులుగా పాలకుర్తి  నియోజకవర్గం లోని రాయపర్తి, పాలకుర్తి, తొర్రూర్,  కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర మండలాల్లో జరిపిన 838 కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. 


కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక భౌతిక దూరం పాటించాలని, గుమి కూడి ఉండవద్దని సూచించారు.కరోనా నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా భాదితులను అవసరమైతే ఆస్పత్రికి తరలించడానికి ప్రతి మండలంలో అంబులెన్స్ లు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.


Updated Date - 2022-01-31T22:51:46+05:30 IST