లక్ష్యాన్ని మించి లీడ్ బ్యాంక్ రుణాలు:మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-14T23:33:54+05:30 IST

వరంగల్ జిల్లా మొత్తం ఋణాల పంపిణి లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 వేల 36 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి రెట్టింపు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లను జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు

లక్ష్యాన్ని మించి లీడ్ బ్యాంక్ రుణాలు:మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: వరంగల్ జిల్లా మొత్తం ఋణాల పంపిణి లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 వేల 36 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి రెట్టింపు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లను జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వ్యవసాయ, పరిశ్రమల ఋణాలు అధికంగా ఉండటం అభినందనీయం. వ్యవసాయ రుణాల లక్ష్యం 1 వేయి 233.13 కోట్లు కాగా 1 వేయి 350.40 కోట్ల ఋణాలు, పరిశ్రమలకు 702.88 కోట్ల లక్ష్యం కాగా, 754.81 కోట్ల ఋణాలు మంజూరు చెయ్యడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, వెంటనే కొత్త ఋణాలు మంజూరు చేయాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాల గ్రౌండింగ్ వేగంగా చేయాలని చెప్పారు. వరంగల్ లీడ్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో డిజిటల్ బ్యాంకింగ్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మొత్తం ప్రాధాన్యత రంగాలకు 2 వేల 482 కోట్ల 60 లక్షల ఋణాలు పంపిణి చేయడం జరిగిందన్నారు. అయితే, వ్యవసాయ టర్మ్ లోన్లు ఇవ్వడం ఇంకా వేగవంతం చెయ్యాలని సూచించారు. మొత్తం 550 కోట్ల కు గాను 245 కోట్లు ఇచ్చారు, ఇంకా 205 కోట్లు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. 2019-20 ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లా ప్రధాన మంత్రి అవార్డుకు ఎన్నిక కావాలని ఆకాంక్షించారు.  సెంట్రల్ బాంక్ అఫ్ ఇండియా, బాంక్ అఫ్ బరోడా, బాంక్ అఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బాంక్, ఇండియన్ ఓవర్సీస్ బాంక్, ప్రైవేటు బ్యాంకులలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు, కర్ణాటక బ్యాంకులు వివిధ ఋణాలలో ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నది. అలాంటి బ్యాంకుల పైన తగిన చర్యలు తీసుకొని పై అధికారులకు తెలియ చెయ్యాలని చెప్పారు.


మహిళా స్వయం సహాయక సంఘాల ఋణ మంజూరులో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ప్రథమ స్థానం లో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. 328.13 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 337.34 కోట్ల ఋణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ఘనత సాధించిన బ్యాంకు అధికారులకు, జిల్లా అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు. మత్స్య కారులకు, గొల్ల కుర్మలకు, పాల ఉత్పత్తి దారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లా లోనే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కేసీసీ మత్స్యకారులకు 456 లోన్లు, గొల్ల కుర్మలకు, పాలఉత్పత్తి దారులకు ౩౩౩ లోన్లను మంజూరు చేపించడం జరిగిందని మంత్రి వివరించారు. కరోనా కష్టకాలం  కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాంకు మేనేజర్ల సహాయం తో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం పట్ల మంత్రి వారిని అభినందించారు.


Updated Date - 2022-02-14T23:33:54+05:30 IST