భక్తులకు సౌకర్యలతో ఐనవోలు జాతర: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-11T20:12:05+05:30 IST

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర సంద‌ర్భంగా అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను ఆదేశించారు.

భక్తులకు సౌకర్యలతో ఐనవోలు జాతర: మంత్రి ఎర్రబెల్లి

ఐన‌వోలు: వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర సంద‌ర్భంగా అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను ఆదేశించారు. జ‌న‌వ‌రి 13,14,15 తేదీల్లో మూడు రోజుల‌పాటు జ‌రిగే జాత‌ర‌లో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు రాకుండా, అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. కోటి రూపాయలతో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన పనులు ప్రణాళికా బద్దంగా చేపట్టాలని ఆదేశించారు.


ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చరిత్రాత్మకమైన ది. మహిమాన్వితమైనది. తాను కూడా ఈ దేవాలయాన్ని తరచూ దర్శిస్తూ ఉంటానని అన్నారు. ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు జరగాలి.700 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన దేవాలయం ఇది. ఈ చరిత్రని మన, మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దేవాలయాన్ని రక్షించి, సంరక్షించుకోవాలి. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, విద్యుత్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి పరచాలని మంత్రి పేర్కొన్నారు.700 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయ చరిత్రని మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాన్ని రక్షించి, సంరక్షించుకోవాలి. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, విద్యుత్ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి పరచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-12-11T20:12:05+05:30 IST