ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యం కొనుగోళ్లు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-14T01:05:52+05:30 IST

రాష్ట్రంలో ఈ కష్ట కాలం లోనూ, మళ్ళీ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యం కొనుగోళ్లు: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: రాష్ట్రంలో ఈ కష్ట కాలం లోనూ, మళ్ళీ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  సీఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాలలో ధాన్యం కొనుగోలు పై ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల తో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు.అత్యంత కష్ట కాలం, క్లిష్ట సమయంలోనూ సీఎం కెసిఆర్ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.3 వేల కోట్ల నష్టాన్ని సైతం లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.కేంద్రం సహకరించకున్నా, గతంలో వడ్ల ను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ, కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. 


రైతులు, అధికారులు, మిల్లర్లు, హమాలీలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలంగా అనేక పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.సమృద్ధిగా నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, నకిలీ ల నివారణ వంటి ఎన్నో చర్యల వల్ల పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని విమర్శించారు. అయినా సరే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను ఆదుకోవడానికి ధాన్యం కొంటున్నారని అన్నారు. అధికారులు సమన్వయంతో పరస్పర సహకారంతో పని చేయాలని సూచించారు. 


ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 1960 కే ధాన్యం కొంటామన్నారు. ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.నర్సంపేట ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు అధికారులు సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. పరకాల ఎమ్మేల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులూ పెట్టవద్దు అని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతులు రవాణా చేసే సందర్బంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 



భూపాలపల్లి, ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు డా. సుధీర్ కుమార్,గండ్ర జ్యోతి,డిసిసి చైర్మెన్ మార్నేని రవీంద్ర రావు,లు వరి ధాన్యం కొనుగోలుపై మాట్లాడారు.కలెక్టర్లు అన్ని కొనుగోలు కేంద్రాలను అజమాయిషీ చేయాలన్నారు.వరంగల్ జిల్లాలో70వేల 243 ఎకరాలలో పంట పండిందిదిగుబడి అంచనా 1 లక్ష 86 వేల 707 మెట్రిక్ టన్నులుఈ సీజన్లో 186 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుఅందుబాటులో 11 గోదాములు సిద్ధంగా ఉన్నాయిజిల్లాలో రా రైస్ మిల్లులు 93, బాయిల్డ్ రైస్ మిల్లులు 21, మొత్తం 114 మిల్లులు అందుబాటులో ఉన్నాయి.


Updated Date - 2022-04-14T01:05:52+05:30 IST