మరో మూడు రోజుల పాటు మరింత జాగ్రత్త: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-09-07T00:57:29+05:30 IST

తెలంగాణతో పాటు పక్కరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపద్యంలో వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను హెచ్చరించారు.

మరో మూడు రోజుల పాటు మరింత జాగ్రత్త: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణతో పాటు పక్కరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపద్యంలో వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను హెచ్చరించారు. సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీ లు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


వరంగల్ పోలీస్ కమిషనర్, ఆయా జిల్లాల ఎస్పీ లు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. రాబోయే 24గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదన్నారు. అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. 


గత అనుభవాలను గుణపాఠాలు గా తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలను ముందుగానే పరిరక్షించే చర్యలు చేపట్టాలన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో వర్ష నష్ట నివారణకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని, భారీ వర్షంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలని అయన కోరారు.అధికారులు తాము ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కి వివరించారు.









Updated Date - 2021-09-07T00:57:29+05:30 IST