పీఎంజీఎస్ వై నిధుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-03-09T02:06:57+05:30 IST

కేంద్రం నుండి రావాల్సిన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్ వై), మహాత్మాగాంధీ (ఎన్ ఆర్ఈజిఎస్) నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర

పీఎంజీఎస్ వై నిధుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎర్రబెల్లి

హైదరాబాద్: కేంద్రం నుండి రావాల్సిన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్ వై), మహాత్మాగాంధీ (ఎన్ ఆర్ఈజిఎస్) నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సోమవారం ఢిల్లీలో  కేంద్ర మంత్రిని ఎర్రబెల్లి కలిశారు. పీఎంజీఎస్ వై 3 వ విడతలో రాష్ట్రానికి రానున్న 2427.50కి.మీ.నుండి 4485కి.మీ.లకు పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


అలాగే  రెండో విడతలో 1794 కి.మీ. అర్హత వుండగా కేవలం 971కి.మీ. మాత్రమే మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ప్రతి విడత విడతకు 25% పెంచాల్సి వుండగా తెలంగాణకు మంజూరులో అలా జరగలేదని అవన్నీ కలుపుకొని 4485కి.మీ. మేర 3వ విడత  పీఎంజీఎస్ వై రోడ్లు ఇవ్వాలని మంత్రి ఆ లేఖలో మంత్రి కోరారు.


దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి కి సమర్పించారు. ఇదే విషయమై గత సంవత్సరం అక్టోబరు 4న రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖ ప్రతిని కూడా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు అందించారు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అని వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉండడం వల్ల కొత్త రోడ్ల అవసరం వుందని ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వాస్తవంగా రావాల్సిన  3వ విడతలో పీఎంజీఎస్ వై  4485 కి.మీ. మంజూరు చేయాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-09T02:06:57+05:30 IST