నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-25T18:33:01+05:30 IST

నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ: నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.  సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను   మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఇప్పటికే ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించిందన్నారు. ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరని.. నిజాయితీగా పనిచేస్తారని.. ముక్కుసూటిగా మాట్లాడుతారని అన్నారు. ఎవరికైనా ఒకేసారి గుర్తింపు రాదని.. తమ వృత్తి నైపుణ్యాన్నీ బట్టి జీతాలు పెరుగుతాయని చెప్పారు. అధిక జీతాల కోసం అత్యాశపడి..అవకాశాలను వదులుకోవద్దని సూచించారు. అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-25T18:33:01+05:30 IST