వరంగల్: మన జీవితమే ఓ చదరంగం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కల్లెడలో చెస్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో గెలుపోటములు సహజమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఇప్పటి నుంచే చదరంగం ఆడుతున్న అందరికీ అభినందనలు తెలిపారు. రాజకీయం కూడా ఒక చదరంగమేనని మంత్రి వ్యాఖ్యానించారు. మీరు క్రీడా చదరంగంలో, మేం రాజకీయ చదరంగంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏమైనా ఎత్తులు, పై ఎత్తులతో కూడిన ఓ అద్భుత క్రీడ చదరంగం అని అన్నారు. చెస్ ఆట మెదడుకు సంబంధించిందన్నారు. ఈ ఆటలో రాణించేవాళ్లు కచ్చితంగా జీవితంలో రాణిస్తారని ఎర్రబెల్లి అన్నారు.