మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబురాలు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-03-03T23:30:28+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారక రామారావు పిలుపు మేరకు ఈ నెల 6, 7, 8 తేదీలలో మహిళా బంధు కేసీఆర్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని, అలాగే,

మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబురాలు: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారక రామారావు పిలుపు మేరకు ఈ నెల 6, 7, 8 తేదీలలో మహిళా బంధు కేసీఆర్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని, అలాగే, తన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఈ సంబురాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అరుదైన, అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ పథకాల అమలు నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మంత్రి తెలిపారు.6వ తేదీన సంబురాల ప్రారంభం సందర్భంగా కేసిఆర్కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేయాలన్నారు.


అలాగే, కేసిఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలన్నారు.7వ తేదీన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా మంది పేదింటి బిడ్డల పెండ్లిండ్లు చేసిన కల్యాణలక్ష్మి, 11 లక్షలు దాటిన కెసిఆర్ కిట్ లు వంటి పలు మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా వాళ్ళ ఇంటి వద్దకెళ్లి కలిసి అభినందించి, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని చెప్పారు.8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలు నిర్వహించాలని మంత్రి చెప్పారు.గతంలో లాగే రైతుబంధు వారోత్సవాలు, కేసిఆర్ జన్మదిన వేడుకల మాదిరిగా తాజా కార్యక్రమాలను విజయవంతంగా, ఘనంగా నిర్వహించాలన్నారు. సీఎం కెసిఅర్ గారు 40 ఏండ్ల తన రాజకీయ అనుభవంతో ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్రంలోని మహిళా సంక్షేమంతో అనుసంధానించి ఘనంగా నిర్వహించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.


మిషన్ భగీరథ పథకంతోఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేసిన కెసిఆర్, మాతా శిశు సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మాతా శిశు మరణాలు తగ్గాయి.ప్రభుత్వ దవాఖానాల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయి. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నది. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. బాలికా, మహిళా విద్య కోసం ప్రత్యేక స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు 70 లక్షల హెల్త్ హై జెనిక్ కిట్లను అందించాము.ఈ పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపనిచ్చారు.

Updated Date - 2022-03-03T23:30:28+05:30 IST