ఉక్కు కర్మాగారం సాధించలేక పోతే బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2022-02-23T22:58:26+05:30 IST

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధించక పోతే బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ బుధవారం ధర్నా నిర్వహించారు.

ఉక్కు కర్మాగారం సాధించలేక పోతే బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి

వరంగల్: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధించక పోతే బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జెడ్పీ ఛైర్మన్ బింధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి పై ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర హక్కులను కలరాయడమే గాక, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ, విభజన హామీలను సైతం ధిక్కరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలను గ్రామాలకు వస్తే ఉరికిచ్చి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం సాధించలేక పోతే రాజీనామా చెయ్యండని అన్నారు.పదవిలో కొనసాగే హక్కు బీజేపీకి లేదని, పైగా సిగ్గు లేకుండా ఎంపీలుగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యని బీజేపీ యే ఆయన్ను అవమానించిందని, విభజన హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు.కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి ఉరిక్కిచ్చి కొట్టాలని, మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రజలను విభజించి, ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో పార్టీలను ఏకం చేసి, బీజేపీ శని వదలగొట్టే పనిలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. ప్రజలు బీజేపీ ఎంపీలను నిలదీయాలి బయ్యారం మన హక్కు .. భిక్ష కాదు సోషల్ మీడియ ను వాడుకుని బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తుంది ప్రదానికి సిగ్గు లేదని అన్నారు. ఉక్కుకర్మాగారం కోసం ఈ పోరాటం ఆగదు . ఢిల్లీలో కూడా దీక్ష కు దిగుతం ..కేసీఆర్ , కేటీఆర్ ఆదేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. 

Updated Date - 2022-02-23T22:58:26+05:30 IST