కోవిడ్ ఇన్‌ఫెక్షన్లను నివారించే బెడ్ తయారు చేసిన విద్యార్ధినికి అవార్డు

ABN , First Publish Date - 2022-02-14T00:56:47+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సమయంలో సోకే ఇన్‌ఫెక్షనలు-సంబంధిత అనారోగ్యాలను నివారించే ప్రత్యేక బెడ్ ను రూపొందించిన హన్మకొండ రామన్ స్కూల్ 10 వ తరగతి విద్యార్థిని భవిత సైన్స్ ఫెయిర్ లో జాతీయ స్థాయి ఇన్స్పైర్ మానక్ అవార్డును గెలుచుకుంది

కోవిడ్ ఇన్‌ఫెక్షన్లను నివారించే బెడ్ తయారు చేసిన విద్యార్ధినికి అవార్డు

హన్మకొండ: కోవిడ్-19 మహమ్మారి సమయంలో సోకే ఇన్‌ఫెక్షనలు-సంబంధిత అనారోగ్యాలను నివారించే ప్రత్యేక బెడ్ ను రూపొందించిన హన్మకొండ రామన్ స్కూల్ 10 వ తరగతి విద్యార్థిని భవిత సైన్స్ ఫెయిర్ లో జాతీయ స్థాయి ఇన్స్పైర్ మానక్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని, ఆమె తల్లి దండ్రులు, ఉపాధ్యాయులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి, శాలువాతో సత్కరించారు. ఇటీవల నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా వారు మంత్రిని హన్మకొండలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, 5 పొరల ఈ బెడ్ వల్ల రోగికి ఇతర ఇన్ఫెక్షన్లు సొకవు. అంబులెన్స్, హాస్పిటల్, ఇంట్లో ఇసోలేశన్ సమయంలోనూ ఈ బెడ్ ను ఉపయోగించవచ్చు. అలాగే పారదర్శకత గల ఫోల్డెబుల్ పొరల వల్ల డాక్టర్లు కూడా పేషెంట్లకు నిర్భయంగా వైద్యం అందించవచ్చునని, ఈ ఆవిష్కరణ భవిష్యత్తు వైద్య రంగంలో ఎంతో ఉపయోగ పడుతుందని మంత్రి అన్నారు. పిల్లలో సృజనాత్మక శక్తిని వెలికి తీసి, గొప్ప ఆవిష్కరణలకు ఉపాధ్యాయులు కారణం అవుతారని, అలా పనిచేసిన ఆ స్కూల్ ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, సిబ్బంది ని కూడా మంత్రి అభినందించారు. భవిత భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-02-14T00:56:47+05:30 IST