వ్యవసాయ అనుబంధ రంగాలలో పండగ వాతావరణం :మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-15T23:09:48+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధి, పంట పెట్టుబడి సాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతి నెలకొందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

వ్యవసాయ అనుబంధ రంగాలలో పండగ వాతావరణం :మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధి, పంట పెట్టుబడి సాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతి నెలకొందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.రైతు బంధు పథకం 2018 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7 లక్షల 4 వేల 309 రైతుల బ్యాంకు ఖాతాలలో 6 వేల కోట్ల 11 లక్షల రూపాయలను పెట్టుబడి సాయంగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగానే హనుమకొండ జిల్లా లో 1 లక్ష 24 వేల 191 రైతుల ఖాతాలలో 970 కోట్ల 77 లక్షల రూపాయలు, వరంగల్ జిల్లాలో 1 లక్ష 32 వేల 387 రైతుల ఖాతాల్లో 987 కోట్ల 82 లక్షల రూపాయలు,  జనగామ జిల్లాలో 1 లక్ష 46 వేల 900 రైతుల ఖాతాలలో 1482 కోట్ల 38 లక్షల రూపాయలు, మహబూబాబాద్ జిల్లాలో 1 లక్ష 44 వేల 828 రైతుల ఖాతాలలో 1275 కోట్ల 4 లక్షల రూపాయలు, ములుగు జిల్లాలో 66 వేల 861రైతుల ఖాతాలలో 550 కోట్ల రూపాయలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 89 వేల 143 మంది రైతుల ఖాతాలలో 734 కోట్ల రూపాయలు రైతుబంధు పెట్టుబడి సహాయం గా జమ చేశామని మంత్రి ఎర్రబెల్లి ఒక ప్రకటనలో తెలిపారు. 


అంతే కాకుండా 2018-19 నుండి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లో రైతు బీమా పథకం కింద మరణించిన 8 వేల 118 మంది రైతు కుటుంబాలకు 405 కోట్ల 90 లక్షల రూపాయల ఆర్థిక సహాయం గా అందించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా హనుమకొండ జిల్లాలో 1401 రైతు కుటుంబాలకు 70 కోట్ల 5 లక్షల రూపాయలు, వరంగల్ జిల్లాలో 1487 రైతు కుటుంబాలకు 74 కోట్ల 35 లక్షల రూపాయలు, జనగామ జిల్లా లో 1650 రైతు కుటుంబాలకు 82 కోట్ల 50 లక్షల రూపాయలు, మహబూబాబాద్ జిల్లాలో 1920 రైతు కుటుంబాలకు 96 కోట్ల రూపాయలు, ములుగు జిల్లాలో 650 రైతు కుటుంబాలకు 32 కోట్ల 50 లక్షల రూపాయలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1010 రైతు కుటుంబాలకు 50 కోట్ల 50 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామని మంత్రి తెలిపారు.


రైతు బంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రికయని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మంది రైతుల ఖాతాలలో 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు జమ చేసిన మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు చేరడం గొప్ప విషయమన్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని, కేసిఆర్ మహా సంకల్పానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు.70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ నాడు ఎవ్వరు చరిత్రలో ఎప్పుడూ అందించని విధంగా రైతుల కోసం రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Updated Date - 2022-01-15T23:09:48+05:30 IST