Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్

హైదరాబాద్: ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ శాసన మండలిలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి మహమూద్ అలీ,  టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ప్రభాకర రావు, బొడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తదితరులు హాజరయ్యారు.


ప్రమాణ స్వీకార అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఆయనను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమర్థుడైన బండా ప్రకాశ్ కు సీఎం కేసిఆర్ మంచి అవకాశం కల్పించారన్నారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేయాలని, అటు ప్రభుత్వానికి, ఇటు శాసన మండలికి, మంచి పేరు తెచ్చే విధంగా పని చేయాలని ఆకాంక్షించారు. 

Advertisement
Advertisement