రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-06T20:18:42+05:30 IST

రాష్ర్టంలోని దళిత ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి: ఎర్రబెల్లి

వరంగల్: రాష్ర్టంలోని దళిత ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దళితుల పురోగతి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పధకం ప్రవేశ పెట్టారని ఆయన పేర్కొన్నారు. వరంగల్ హన్మకొండ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణలో దళితుల సంక్షేమం, అభివృద్ధికోసం ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 10కోట్ల రూపాయలను దళిత వాడల అభివ`ద్ధి కోసం ఖర్చు చేయనున్నదని చెప్పారు.అంబేద్కర్ కేవలం దళితుల వర్గానికి చెందిన వాడు మాత్రమే కాదని, ఆయన అందరి వాడని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసిఆర్ లక్ష్యం అన్నారు. 


అంబేద్క‌ర్ రాజ్యాంగ రూప‌క‌ర్త‌గా,న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు.మ‌న దేశ మొట్ట మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి.మ‌హ‌ర్ కులానికి చెందిన అంబేద్క‌ర్ చిన్న నాటి నుండే కుల వివ‌క్ష‌ను, అంట‌రాని త‌నాన్ని ఎదుర్కొన్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T20:18:42+05:30 IST