Advertisement
Advertisement
Abn logo
Advertisement

దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది: ఎర్రబెల్లి

హైదరాబాద్: దివ్యాంగులకు వివిధ అభివృద్ధి సంక్షేమ చేపట్టడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అయినా శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఐదు లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెల 3016 రూపాయలు పింఛన్లు ఇస్తున్నామని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, చేతి కర్రలు, త్రీ వీలర్ స్కూటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు అని ఆయన తెలిపారు. 


దీనికి తోడుగా దివ్యాంగులకు అత్యాధునిక డిజిటల్ పరికరాలు, సబ్సిడీపై రుణాలు, విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ లాప్ టాప్ లు, ఒక కోటి రూపాయల తో దివ్యాంగ విద్యార్థులకు ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, నిరుద్యోగ దివ్యాంగులకు నైపుణ్యాభివృద్ధి వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ఒక లక్ష రూపాయల నగదు అందజేయబడుతున్నదని, రాష్ట్రంలోని దివ్యాంగులకు 18 హాస్టల్ లో ఏర్పాటు చేయబడ్డాయి అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement