ధాన్యం కొనుగోళ్ల విషయంలో బండిసంజయ్ డ్రామాలాడుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-10-29T01:12:30+05:30 IST

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీరాష్ట్ర అధినేత బండి సంజయ్ దీక్షలపై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బండిసంజయ్ డ్రామాలాడుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీరాష్ట్ర అధినేత బండి సంజయ్ దీక్షలపై  రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన హన్మకొండలో మీడియా తో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్ దీక్ష కి అర్ధం ఉందా?!ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్ దీక్ష ? బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన దుయ్యబట్టారు. ధాన్యం కొన బోమని చెప్పింది ఎవరు? కేంద్రం కాదా? అయినా, రైతుల శ్రేయోభిలాషులు గా సీఎం కెసిఆర్ ధాన్యం కొంటామనే చెబుతున్నారు.దమ్ముంటే బండి సంజయ్,ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీకు దమ్ముంటే తెలంగాణ పట్ల,తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ఉంటే....తెలంగాణలో వేసే ప్రతి పంటా, మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి ఉత్తర్వులు తీసుకురండి.....చేతకాకపోతే,మీరు చవట లని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.


దొంగ ప్రేమ. కపట నాటకాలు ఆడుతున్నది బిజెపి నాయకులేనని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే బీజేపీ ఈ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని అన్నారు.హుజూరాబాద్ లో వార్ వన్ సైడేనని బీజేపీ తలకాయ కిందకు పెట్టి, కాళ్ళు పైకి పెట్టినా, చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. మంచి పదవులు, అవకాశాలు ఇస్తే, ఈటల రాజేందర్ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ను బొంద పెడతానన్నప్పుడే ఈటెల రాజేందర్ వైఖరి బయటపడిందన్నారు. మచ్చలేని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ గారు హుజూరాబాద్ లో నిలబెట్టారు గెల్లు శ్రీనును హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు విషయం లో బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2021-10-29T01:12:30+05:30 IST