Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 10 2021 @ 17:06PM

వృద్దాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం: ఎర్రబెల్లి

హైదరాబాద్: కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియను అక్టోబర్ 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునే ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ కమీషనర్ లకు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.సీఎం కెసిఆర్ ఆదేశానుసారం సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. క్రొత్తగా దరఖాస్తులు చేసుకొనే వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 


ఆగస్టు 31 నాటికి క్రొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికి, అర్హులైన అందరికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఈ నెల 11 నుండి 30 లోగా దరఖాస్తుకు మరో అవకాశం కల్పించింది. ఈ సేవ లేదా మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసి కమీషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కెసిఆర్ ఆదేశాల ప్రకారం 57 ఏండ్లు, ఆపై వయస్సు కలిగిన వాళ్లంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపిచ్చారు. 


ఆసరా పెన్షన్ల లో భాగంగా కనీస వయస్సు 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు.కాగా ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ఆసరా పెన్షన్లు ఉన్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement