Advertisement
Advertisement
Abn logo
Advertisement

అహింస ద్వారా ఏదైనా సాధించగలమని నిరూపించిన మహాత్ముడు

వరంగల్: అహింస మార్గం ద్వారా ఏదైనా సాధించ వచ్చని నిరూపించిన మహాత్మా గాందీ నేటి తరానికి స్పూర్తిగా నిలుస్తారని పంచాయితీరాజ్, గ్రామీణశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన నియోజక వర్గమైన పాలకుర్తిలో భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా మహాత్మునికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు అని కొనియాడారు.సత్యం, అహింస మార్గాన ఏదైనా చేయగలం అని నిరూపించిన మ‌హా వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు.గ్రామాలు అభివృద్ధి చెందాలని గాంధీజీ కోరుకునేవారు.


ఆ గాంధీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్నారు నేటి తెలంగాణ గాంధీ కేసిఆర్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్ర‌తి నెలా నిధులు అందిస్తున్నారు.రాష్ట్రంలో 3 వేల 146 తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా మార్చారు. పల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో గ్రామాల, ప‌ట్ట‌ణాల‌ రూపు రేఖ‌లే మారిపోయాయని మంత్రి పేర్కొన్నారు.హ‌రిత హారం తో గ్రామాల్లో గ్రీన‌రీ పెరిగి ప‌చ్చ‌ద‌నం పరుచుకుంది.ప్ర‌తి గ్రామంలో స్మ‌శాన వాటిక‌లు, డంపింగ్ యార్డులు, న‌ర్స‌రీలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, మంకీ ఫుడ్ కోర్టులు, బృహ‌త్ ప్ర‌కృతి వ‌నాలు, రైతు క‌ల్లాలు, రైతు వేదిక‌లు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప‌ల్లెల‌ను బ‌లంగా అభివృద్ధి చేస్తున్న‌ ఘనత కేసీఆర్ దేనని అన్నారు. మ‌హాత్మా గాంధీని నేటి యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాలన్నారు.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement