Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 14:30PM

బాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసి పురోగమించాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరై బాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యలు స్వీకరించిన బాజిరెడ్డికి అభినందలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.సామాన్యుడి ప్రయాణ రథం అయిన ఆర్టీసి బస్సు ప్రగతి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.ఆర్టీసీ దినదిన ప్రవర్ధ మానమై, ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా చేయాలని అన్నారు.

Advertisement
Advertisement