పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-09-17T20:29:46+05:30 IST

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వాక్సిన్ తీసుకోవాలని పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారంతా వ్యాక్సిన్ తీసుకోవాలి

వరంగల్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వాక్సిన్ తీసుకోవాలని పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.రాష్ట్రంలో మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్వ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, పెర్కవేడు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం,తొర్రూరు, జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం, నవాబ్ పేట గ్రామంలో  స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభి0చారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. తద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు.


రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారు.ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది 55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా కలిసి కలిసికట్టుగా, సమన్వయంతో కరోనా వ్యాక్సినేషన్ ని విజయవంతం చేయాలన్నారు.

Updated Date - 2021-09-17T20:29:46+05:30 IST