తెలంగాణ ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా ఉంది: మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-06-29T21:29:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా వుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao) అన్నారు

తెలంగాణ ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా ఉంది: మంత్రి Errabelli

వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా వుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar rao) అన్నారు.కేసిఆర్ నాయకత్వం రాష్ట్రాన్ని పటిష్ఠంగా ఉంచిందన్నారు. దేశంలో ఎక్కడ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.రైతులకు ఎదురు పెట్టుబడి పెట్టిన మహానుభావుడు కేసిఆర్(kcr)అని అభివర్ణించారు.బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మన ఊరు మన బడి కరెంట్ సరఫరా, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం 40లక్షల 19 వేలతో శంకు స్థాపన లు చేశారు.80లక్షల నిధుల తో అంతర్గత సిసి రోడ్లు, 10 లక్షల తో వైకుంఠ ధామం, 2.5లక్షలతో డంపింగ్ యార్డ్ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.


ఆశాలపల్లి గ్రామానికి 286 ఆసరా పెన్షన్ లు, 720 మందికి రైతు బంధు, 44 మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజి ద్వారా నిధులు, 44 మంది కి వడ్డీ లేని రుణాలు, 24 కేసీఆర్ కిట్ లు, 3 గ్గురు రైతులకు రైతు భీమా అందించినట్లు మంత్రి తెలిపారు.ఈ ఒక్క రోజే కోటి కి పైగా నిధులు ఇస్తున్నట్లు, ఇప్పటి వరకు మొత్తం అశాల పల్లి  గ్రామానికి 10 కోట్ల నిధులతో పలు అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు మంత్రి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆశాల పల్లె కు వస్తె తల్లి గారింటికి వచ్చినట్లు ఉన్నది.నన్ను మీరు ఆదరించారు. ఇవ్వాళ పాలకుర్తికి పంపించారు.నన్ను అక్కడి ప్రజలు ఆశీర్వదించారు.సీఎం కేసిఆర్ నాకు మంత్రి పదవి ఇచ్చి అనేక పనులు అప్పగించారని అన్నారు. ఇవ్వాళ మొత్తం రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. 


బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా ఉందా?24 గంటల కరెంటు ఎక్కడైనా వస్తుందా?సీఎం కేసిఆర్ కిట్లు ఎక్కడైనా ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, అమ్మ ఒడి వంటి పథకాలు ఎక్కడా లేవు.కాంగ్రెస్, బీజేపీ లు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొన్నమహానుభావుడు కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్ , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్  గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T21:29:53+05:30 IST