యాదాద్రిజిల్లా: యాదాద్రి ఆలయాన్ని(yadadri temple) ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) తీర్చిదిద్దారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చూస్తే యాదాద్రి కేనా వచ్చింది అన్నంత అభివృద్ధి జరిగిందన్నారు. ప్రపంచం అబ్బుర పడేలా ప్రఖ్యాత దేవాలయంగా యాదాద్రిని సీఎం గారు తీర్చిదిద్దారని అన్నారు.ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి లతో కలిసి బుధవారం మంత్రి ఎర్రబెల్లి యాదాద్రిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీర్వచనాలతో తెలంగాణ ఎంతో పురోగమిస్తోందన్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మా ఇలవేల్పు. ఈ సందర్భంగా స్వామివారి కి పూజలు నిర్వహించినట్టు తెలిపారు మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. సీఎం కేసిఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. అంతకు ముందు మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు.
ఇవి కూడా చదవండి