పల్లె ప్రగతితో గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి:Errabelli

ABN , First Publish Date - 2022-06-11T20:46:11+05:30 IST

పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

పల్లె ప్రగతితో గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి:Errabelli

కామారెడ్డిజిల్లా: పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. ఇప్పుడు గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకురుతున్నాయని, ఒకప్పటి పట్టణ, నగర వలస తగ్గిపోయి, ఇప్పుడు పల్లెలకు వలస మొదలైందన్నారు. గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి.పారిశుద్ధ్యం పెరిగి, ఆరోగ్యం పెరిగి గ్రామాలు ఆయు ఆరోగ్యాలకు అడ్రెస్స్ గా మారాయని చెప్పారు.ఒక గ్రామానికి పచ్చదనం పెంచడానికి నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 


రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు.. ఇలా ఇన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పెట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి(palle pragati) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపల్లెప్రగతితో పల్లెలు ఎంతో పురోగమించాయన్నారు.సీఎం కేసిఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. పల్లెల్లోరోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మాణం జరిగాయి.పైగా ట్రాక్టర్ల ద్వారా ఆదాయ మార్గాలు కూడా పెరిగాయన్నారు. 


కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు 1450 కోట్లురావాల్సి వున్నా,ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చేసిందని చెప్పారు.కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా గ్రామాలకు 230 కోట్ల నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బి బి పాటిల్, ఎమ్మెల్యే హనుమంతు షిండే తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. మంత్రులతో కలిసి గ్రామంలో వాడవాడలా పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించారు. 


Updated Date - 2022-06-11T20:46:11+05:30 IST