ఒక్కో గ్రామానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నాం: మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-06-08T20:55:38+05:30 IST

ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నదని.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఒక్కో గ్రామానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నాం: మంత్రి Errabelli

మహేశ్వరం: ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అన్నీ కలిపి కోటి రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నదని.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాలకు చేసిందని ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం కెసిఆర్ వచ్చాకే తెలంగాణలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని అన్నారు.5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ జి రంజిత రెడ్డితో కలిసి చేశారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రగతి పరుగులు పెడుతున్నది.70 ఏళ్ల నుండి కానిది సీఎం కెసిఆర్ 8 ఏళ్లలో సాధించి చూపారని చెప్పారు.


 ఇవ్వాళ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు.ఒక ఇంటికి కనీసం రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ నల్లా ల ద్వారా నీళ్ళు, డ్వాక్రా మహిళలకు నిధులు, రుణాలు అందుతున్నాయన్నారు.గ్రామంలో అంతర్గత రోడ్లకు 40 లక్షలు మంజూరు చేస్తున్నాను.కేంద్రం చెప్పినట్లు వింటే తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తారట.అమిత షా చెప్పినట్లు కేసిఆర్ వినాలటనా?అంటూ ప్రశ్నించారు.  ప్రాణంఉన్నంత వరకు రైతుల కోసం పని చేస్తానన్న కేసిఆర్ లాంటి సీఎం ఎవరికి లేరని అన్నారు.కేసిఆర్ లాంటి పథకాలు మిగతా రాష్ట్రాల్లో కావాలని అడుగుతున్నారు.అందుకే కేంద్రం మన రాష్ట్రం పై కక్ష కట్టింది.కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేశారని మంత్రి ఆరోపించారు.


ఈసందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గోల్లూరు కు త్వరలోనే బస్సు సదుపాయం కల్పిస్తాం బస్సులు ఎక్కి, వాటిని నడిచే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదని చెప్పారు.పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని,గతంలో ఇంతగా అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఇంత అభివృద్ధికి సహకరించిన సీఎం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే గ్రామ మరింత అభివృద్ధికి ఒక సమీక్ష సమావేశం పెడతానుగ్రామంలో నే పల్లె నిద్ర చేస్తాను. ఆ రోజు మనమంతా కలిసి అన్ని సమస్యలకు పరిష్కారాలు చూద్దాం.


Updated Date - 2022-06-08T20:55:38+05:30 IST