కుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ రద్దు:minister errabelli

ABN , First Publish Date - 2022-06-01T21:32:36+05:30 IST

రంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(kakatiya urban development authority) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూలింగ్(land pooling) ని రైతు పక్షపాత ప్రభుత్వంగా, రైతుల కోరిక మేరకు, సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం రద్దు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao)వెల్లడించారు.

కుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ రద్దు:minister errabelli

హనుమకొండ: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(kakatiya urban development authority) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూలింగ్(land pooling) ని రైతు పక్షపాత ప్రభుత్వంగా, రైతుల కోరిక మేరకు, సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం రద్దు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao)వెల్లడించారు. రైతులు ఆందోళన చెంద వద్దని, కొందరి స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని, ల్యాండ్ మాఫియా ల మాయలో పడవద్దని మంత్రి రైతులకు పిలుపు నిచ్చారు. కేసిఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో రైతులను అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఈ మేరకు వరంగల్ "కుడా" ల్యాండ్ పూలింగ్ పై హనుమకొండ లోని ఆ కార్యాలయం లో జరిగిన విస్తృత స్థాయి సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని, మంత్రి ఎర్రబెల్లి మీడియాకు వివరించారు.


రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ అమలులో ఉంది. ఇదే తరహాలో "కుడా" లో కూడా భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి కోసం, రైతాంగానికి నష్టం కలగకుండా, వారి ఆమోదంతో ఆ జీఓ ను అనుసరించి, ల్యాండ్ పూలింగ్ చేయాలని "కుడా" భావించింది. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోని 28 గ్రామాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీలుగా ఫారం-1తో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, రైతులు తమ సాగు భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ళు ఇచ్చిన వినతులు, అక్కడక్కడ ఆందోళనల ద్వారా తెలిసింది. 


రైతుల కోరిక మేరకు చాలా రోజుల క్రితమే, పూలింగ్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం. పట్టణ, నగరపాలక సంస్థల ముఖ్య కార్యదర్శి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం అయ్యాం. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళడం,ఆయన అనుమతి అనివార్యం అవడంతో,తాను వచ్చేదాకా వేచి, వారి అనుమతి తీసుకొని, ల్యాండ్ పూలింగ్ ను రద్దు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి రాజయ్య, ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, "కుడా" వైస్ చైర్మన్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-01T21:32:36+05:30 IST