కేసీఆర్ పట్ల మోదీ వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవు:Errabelli

ABN , First Publish Date - 2022-05-27T02:07:00+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli dayakar rao) ఫైర్ అయ్యారు.

కేసీఆర్ పట్ల మోదీ వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవు:Errabelli

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గట్టుగా లేవని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు(errabelli dayakar rao) ఫైర్ అయ్యారు. అవ‌గాహ‌న లేకుండా, చ‌రిత్ర తెలియ‌కుండా, మోడీ చేసిన కామెంట్స్ ఆయ‌న ప‌ద‌వికి త‌గ్గ‌ట్టుగా లేవ‌న్నారు.మోదీకి కుటుంబం లేద‌ని, అందువ‌ల్ల ఆయ‌న‌కు సెంటిమెంట్లు తెలియ‌వ‌న్నారు. సీఎం కేసిఆర్ ది కుటుంబ పాల‌న కాద‌ని, ఆయ‌న కుటుంబ‌మంతా తెలంగాణ కోసం ఉద్య‌మించి జైళ్ళ‌కు పో్యి త్యాగాలు చేసిందని అన్నారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన వారిని అవ‌మానించ‌డ‌మంటే రాజ్యాంగాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని అవ‌హేళ‌న చేయ‌డ‌మేన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. 


ఈ మేర‌కు ఆయ‌న హైద‌రాబాద్ లోని త‌న మంత్రుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాన మంత్రి స్థాయిలో లేవునీచంగా, దిగ జారి మాట్లాడిన‌ట్లుగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటును పార్ల‌మెంటులో కించపరిచిన మోదీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను నూక‌లు తిన‌మ‌ని అవ‌మాన పరిచారని గుర్తు చేశారు. తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపిస్తూనే ఉన్న‌వు మోదీ ఇవ్వాళ వ‌చ్చి తెలంగాణ‌పై క‌ప‌ట ప్రేమ చూపిస్తే ఎవ‌రూ న‌మ్మ‌రని అన్నారు. 


తెలంగాణ ప్ర‌జ‌లంటే అభిమాన‌మ‌ని మ‌రోసారి అవ‌మాన ప‌రుస్తున్నారు.ఇంత కంటే దిగ‌జారుడు ఇంకోటి లేదన్నారు.తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆయ‌న కుటుంబం అంతా పాల్గొన్న‌ది.ఎన్నో త్యాగాలు చేసి, ప్ర‌జాస్వామ్య బద్ధంగా ప్ర‌జ‌ల చేత‌ గెలిచిన నేత‌లని అన్నారు.వారిది కుటుంబ పాల‌న ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణ పై విక్ష‌వ‌, విషం చిమ్మ‌డం, విద్వేషంతో మాట్లాడ‌ట‌మే మీ ప‌నా?అయితే మ‌తం లేక‌పోతే ప్రాంతాల పేరుతో ప్ర‌జ‌ల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. 

Updated Date - 2022-05-27T02:07:00+05:30 IST