పల్లెప్రగతి 5వ విడత పై ఉన్నతాధికారులతో Errabelli సమావేశం

ABN , First Publish Date - 2022-05-26T22:05:38+05:30 IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిని విజయవంతం చేయడానికి వందశాతం పని చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

పల్లెప్రగతి 5వ విడత పై ఉన్నతాధికారులతో Errabelli సమావేశం

హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిని విజయవంతం చేయడానికి వందశాతం పని చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. గురువారం రాజేంద్ర నగర్ లోని TSIRD లో జరిగిన సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమం అంటూ కొనియాడారు. ఈ సమావేశంలోజెడ్పీ చైర్మన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశంలో ఇప్పటివరకు నిర్వహించిన పల్లె ప్రగతి విజయాలు, వచ్చే పల్లె ప్రగతి నిర్వహణ పై జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ సీఈవో లకు మంత్రి ఎర్రబెల్లి దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్లు, చైర్ పర్సన్ లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ శరత్, ప్రత్యేక కమిషనర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లు.స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ల ను పల్లె ప్రగతి కార్యక్రమానికి, జెడ్పీ చైర్మన్ల కు అనుసంధానం చేయాలని కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ను మంత్రి ఎర్రబెల్లి అదేశించారు. 


దేశంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాలను నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ సాధించుకున్నదన్నారు. 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మన రాష్ట్రమే సాధించిందన్నారు. పారిశుద్ధ్యంలో, ఈ పంచాయతీ లో, ఆడిటింగ్ లో మల మూత్ర విసర్జన రహిత గ్రామాల్లో, పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో మన గ్రామాలే నెంబర్ వన్ గా ఉన్నాయన్నారు.ప‌ల్లె ప్ర‌గ‌తి, ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసిన‌ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారుల శ్రమ ఫలితంగా అవార్డులు వచ్చాయన్నారు.మీకు ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా పూర్తిగా ఉందిని,15 ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 


మొత్తం గ్రాంట్ ని గ్రామ పంచాయతీలకు 85%, మండలాలకు 10%, జెడ్పీ లకు 5% నిధులను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.నిజామాబాద్, నల్గొండ, వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్లు ధర్మన్న విఠల్ రావు, బండా నరేందర్ రెడ్డి, లోక నాథ రెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగా రెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీం నగర్, జగిత్యాల, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల జెడ్పీ  చైర్ పర్సన్ లు  పట్నం సునీత, సల్గూటి స్వర్ణ లత, గండ్ర జ్యోతి, టి. అనితా రెడ్డి, న్యాల కొండ అరుణ, దపేదార్ శోభ, కనుమల్ల విజయ, దావా వసంత, కోవా లక్ష్మి, యాదాద్రి జెడ్పీ సీఈఓ తదితరులు సన్నాహక సమావేశంలో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలిపారు.


Updated Date - 2022-05-26T22:05:38+05:30 IST