Textile park స్ధలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-05-05T00:47:40+05:30 IST

ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం చింతల పల్లి kaitex మెగా textile park ను పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Textile park స్ధలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం చింతల పల్లి kaitex మెగా textile park ను పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.Textile park స్థలాన్ని, పరిశ్రమ పని చేస్తున్న విధానాన్ని, ఉత్పత్తి, అక్కడి అవకాశాలు వంటి పలు అంశాలను మంత్రి పరిశీలించారు. అలాగే Textile park అధికారులతో మాట్లాడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గతంలో వరంగల్ లో అజంజాహి మిల్లు ద్వారా అనేకమంది కి ఉపాధి లభించేదని, కానీ ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ మిల్లు మూతపడిందన్నారు.


చివరకు ఆ మిల్లు స్థలాలను కూడా అమ్ముకున్నారని గుర్తుచేశారు. గత చరిత్రను మరిచిపోయే విధంగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం లో మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని కైటెక్స్ మెగా టెక్స్టైల్ కంపెనీ వరంగల్ కు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు.టెక్స్ టైల్ మెగా పార్క్ వరంగల్ తెచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారు.ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కు ఈ నెల 7 వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని తెలిపారు. Kaitex మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి అయితే ఇక్కడి నిరుద్యోగ యువత కు మంచి ఉపాధి లభిస్తుందన్నారు. 2500 మందికి ప్రత్యక్షంగా అంతకు తగ్గని విధంగా పరోక్షంగా అనేకమందికి ఈ కంపెనీ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.


ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఉన్నకారణంగా బయట చెత్త ఏరుకునే వారికి సైతం ఇక్కడ ఉపాధి లభిస్తుంది.మెగా పార్క్ నిర్మాణానికి స్థలాలను ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి ఎకరాకు వంద గజాల స్థలం పార్క్ లోపలే ఇస్తున్నామన్నారు.త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేస్తారు.ఈ విధంగా దాదాపు 48 మంది రైతులకు పునరావాసం లభించనుంది.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్శనలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డితో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, ఆయా శాఖల అధికారులు, kaitex మెగా textile park అధికారులు మంత్రితో పాటు ఉన్నారు.


Read more