పాలకుర్తి సుందరీకరణకు సహకరించాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-05-01T21:42:21+05:30 IST

జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వివిధ పార్టీలు, వ్యాపార వర్గాలు, ప్రజలతో కలిపి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

పాలకుర్తి సుందరీకరణకు సహకరించాలి: మంత్రి ఎర్రబెల్లి

జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వివిధ పార్టీలు, వ్యాపార వర్గాలు, ప్రజలతో కలిపి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి సుందరీకరణకు అందరూ సహకరించాలని కోరారు. అత్యంత వెడల్పైన రోడ్లు అభివృద్ధికి నిదర్శనంగా పాలకుర్తి నిలుస్తుందన్నారు.సువిశాలమైన రోడ్లు సుందరీకరణ కు అస్కారమిస్తాయని అన్నారు.సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయి.పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని అన్నారు. మొదట్లో కొంత ప్రతిఘతన వచ్చినప్పటికీ ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారని,విగ్రహాలను తొలగించాలని మాకు లేదు.ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 


అయితే, పాలకుర్తి ప్రధాన కూడలిలోని విగ్రహాలను శాశ్వతంగా తొలగించడం లేదని,తాత్కాలికంగా జరిపామని చెప్పారు. త్వరలోనే వాటిని సముచిత స్థానం లో ఏర్పాటు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాజీవ్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి అని ఆయనంటే అందరికీ గౌరవమేనని చెప్పారు.రాజీవ్ విగ్రహం తో పాటు అదే స్థానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రోడ్ల వెడల్పు సుందరీకరణ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవివిధ పార్టీ ల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు. వాళ్లకు మంత్రి సమాధానమిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికంగా వివిధ పార్టీల నేతలు, వ్యాపారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-01T21:42:21+05:30 IST